త్రివిక్రమ్ - నాగార్జున కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ హిట్ 'మన్మధుడు' సినిమాకి సీక్వెల్ రూపొందించాలనే యోచనలో నాగార్జున ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌కి తాజాగా రంగం సిద్ధమైందనీ తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేతిలో ఈ ప్రాజెక్ట్‌ని పెట్టాడు నాగార్జున. 'చిలసౌ' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన రాహుల్ రవీంద్రన్‌కి ఇంత పెద్ద బాధ్యత అప్పగించేశాడు నాగార్జున. తనకిచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకునే దిశగా రాహుల్ రవీంద్రన్ అదిరిపోయే స్క్రిప్టు ప్రిపేర్ చేశాడట.
ఈ నెల 25 నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లనుందనీ తాజా సమాచారమ్. అదే రోజు రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారట. తొలి పార్ట్‌కి ఏమాత్రం తీసిపోకుండా, పంచ్ డైలాగ్స్‌ని సిద్ధం చేశాడట రాహుల్ రవీంద్రన్. రాహుల్‌తో ఈ స్క్రిప్టు కోసం ఓ స్పెషల్ టీమ్ వర్క్ చేసిందట. నాగార్జున తన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మించనున్నారనీ తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా 'ఆర్ఎక్స్' బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ పేరు వినిపిస్తోంది.
మరోవైపు నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' ప్రీక్వెల్‌ని కూడా లైన్లో పెట్టుంచిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, త్వరలో బాలీవుడ్ మూవీ 'బ్రహ్మాస్త్ర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అక్కినేని నాగార్జున.