అడల్ట్ హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న చిత్రం 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. ఈ సినిమా ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. అలాగే విమర్శలు కూడా వచ్చాయిలెండి. ఇకపోతే ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గరుడవేగ', '24 కిస్సెస్' తదితర చిత్రాలతో రొమాంటిక్‌గా ఆకట్టుకున్న హీరో అరుణ్ అదిత్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నిఖిత, భాగ్యశ్రీ, మిర్చి హేమంత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
కాగా ఈ సినిమా గురించి హీరో కొన్ని ముచ్చట్లు ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ట్రైలర్‌ని బట్టి సినిమాలో కంటెన్ట్ ఏంటో ఆల్రెడీ అర్ధమైపోయింది. అయితే తాజాగా హీరో చెబుతున్న మాటల ప్రకారం సినిమా చూసేందుకు మరీ అంత అసభ్యంగా ఉండదనీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తప్ప ఫిజికల్‌గా అసభ్యకరంగా ఉండే సీన్లేమీ ఉండవనీ అంటున్నాడు. అయితే ఈ విషయాన్ని మరీ కొట్టి పారేయడానికేం లేదండోయ్. టీజర్‌ని, ట్రైలర్‌నీ బట్టి సినిమా అంచనా వేయడం తగదిప్పుడు.
అయితే సెన్సార్ బోర్డ్ క్లీన్ 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి, అడల్ట్ కామెడీ పాళ్లు కూసింత ఎక్కువే అని గ్రహించాలి. ఏది ఏమైతేనేం అడల్ట్ కామెడీని ఇష్టపడే వాళ్లు ఈ సినిమా విచ్చల విడిగా చూడొచ్చు. అలాగే హీరో చెబుతున్న మాటల ప్రకారం అన్ని వర్గాల వారూ పండగ చేసుకోవచ్చు. మొత్తానికి 'చీకటి గదిలో చితక్కొట్టుడు' ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో మరి కొన్ని గంటల్లోనే తెలిసిపోతుందిలెండి.