ఆది వన్‌ ఆఫ్‌ ది స్పెషల్‌ గై.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరోల్లో తన రూటే వేరంటాడు ఆది పినిశెట్టి. మామూలుగా అయితే హీరోగా పలు అవకాశాలు రెడీగా ఉంటాయి ఆది పినిశెట్టికి. కానీ ఇంపార్టెంట్‌ రోల్స్‌లో ఎన్ని డిఫరెంట్‌ యాంగిల్స్‌ చూపించాలో అన్ని రకాలూ ట్రై చేసేశాడు ఇప్పటికే. ఇంకా ఎంతో ఉందంటున్నాడు. 

హీరోగా చేస్తే ఒకే రకమైన గుర్తింపు వస్తుంది. అదే డిఫరెంట్‌ రోల్స్‌లో అయితే ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. నటుడిగా అంతకన్నా కావాల్సిందింకేముంటుంది అంటున్నాడు. అవును కదా ఓ నటుడిగా తనలోని టాలెంట్‌ ఎన్ని రకాలుగా ప్రదర్శించాలో అన్ని రకాలుగా ప్రదర్శిస్తేనే అసలు సిసలు నటుడనిపించుకునేది. 

తాజాగా ఆది పినిశెట్టి 'నీవెవరో' చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా రిజల్ట్‌ ఏంటనేది ఇంకా తెలియలేదు కానీ, ఒకవేళ మంచి విజయం అందుకుంటే, తర్వాత సోలో హీరోగా వరుస సినిమాలు చేస్తాడా అంటే నో అంటున్నాడు మన ఆది. మంచి విజయం అందుకున్నా కానీ, తర్వాత ఇంపార్టెంట్‌ రోల్స్‌లో నటించేందుకే సై అంటానంటున్నాడు. సెప్టెంబర్‌ 13న సమంత ప్రధాన పాత్రలో రాబోతున్న 'యూటర్న్‌' చిత్రంలో ఆది కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

అలాగే ఆది హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందబోతోందట. హేమంత్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. బైక్‌ రేస్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. మరోవైపు 'ఆర్‌ఎక్స్‌ 100' తమిళ రీమేక్‌లోనూ ఆది నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS