డాన్స్ కోసం డాన్సులేసినట్లుండవు. ఇలాంటి పాటలకు కొరియోగ్రఫీ చేయడం చాలా కష్టం. చరణ్ తన సమర్థతకు తగ్గట్లుగా డాన్సులు చేయలేదు. ఎందుకంటే ఆ పాటలకు అంతే అవసరం. ఇలాంటి పాటలకు ఎంత అవసరమో అంతే చేయాలి. ఎందులోనైనా చరణ్ కనిపించడు. చిట్టిబాబు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అదే 'రంగస్థలం' ప్రత్యేకత అంటున్నాడు యంగ్ హీరో ఆది పినిశెట్టి.
'రంగస్థలం'లో ఆది కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిట్టిబాబుకు అన్నయ్య పాత్ర అది. కుమార్‌బాబు పాత్ర పేరు. చాలా బుద్ది మంతుడు, నిజాయితీ పరుడు. ట్రైలర్‌లో చిట్టిబాబు చెబుతున్నాడు కదండీ. 'కుమార్‌బాబును తాకాలంటే, ఈ చిట్టిబాబుగాడి గుండెకాయని దాటెళ్లాలి..' అని. అంటే ఆ పాత్ర సినిమాకి ఎంత కీలకమో. చిట్టిబాబుకు ఆ పాత్రంటే ఎంత ఇష్టమో అర్ధమవుతోంది. అందుకే ఈ పాత్ర తన కెరీర్‌లోనే చాలా కీలకమైనది అంటున్నాడు మన కుమార్‌బాబు. అదేనండీ ఆది పినిశెట్టి.
ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పాత్రలో నటించలేదు. ఇక ముందు కూడా ఇలాంటి పాత్రలో నటిస్తానని గ్యారంటీ లేదు. ఇంత గొప్ప అవకాశాన్ని సుకుమార్ తనకిచ్చారనీ అందుకు మనస్పూర్తిగా సుకుమార్‌కి ధన్యవాదాలు అని ఆది చెబుతున్నాడు. చరణ్ - సమంత తొలిసారి జత కట్టిన సినిమా 'రంగస్థలం'. ప్రేక్షకులను శాంతం ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే అద్భుతమైన దృశ్య కావ్యం. మరి కొద్ది గంటల్లోనే ఈ అద్భుతం ధియేటర్స్‌లో సందడి చేయనుంది.
మార్చి 30న అంటే రేపే 'రంగస్థలం' ప్రేక్షకుల ముందుకు రానుంది.