ఇక్కడ ఆది పినిశెట్టి, అక్కడ సోనాక్షి!

By iQlikMovies - June 27, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా నటిస్తున్న సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ఫిట్‌నెస్‌ విషయంలో ఈ మధ్య కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వార్తలు విన్నాం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇది సౌత్‌కి సంబంధించిన మేటర్‌. ఇంకో అసలు మేటర్‌ ఉంది. అదేంటంటే, బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా తెలుసు కదా. ఈమెను కూడా అథ్లెట్‌ పాత్రలో చూడబోతున్నామనే వార్త బాలీవుడ్‌ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారంలో ఉంది.

 

ప్రముఖ పారా ఒలింపిక్‌ ఛాంపియన్‌ దీపా మాలిక్‌ బయోపిక్‌ని సోనాక్షి ప్రధాన పాత్రలో రూపొందించే ఆలోచనలో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలున్నారనీ సమాచారమ్‌. ఈ పాత్రకు సోనాక్షి అయితేనే బావుంటుందని వారు భావిస్తున్నారట. అయితే, ఈ విషయమై సోనాక్షిని డైరెక్ట్‌గా అడిగితే, 'ఏమో.. ఇలాంటి విషయాలను నేను నమ్మను. నా వరకూ నేను అగ్రిమెంట్‌పై సైన్‌ చేస్తేనే ఆ సినిమా గురించి మాట్లాడతాను..' అంటూ సస్పెన్స్‌లో పెట్టి వదిలేసింది.

 

ఇంతకీ ఈ అథ్లెట్‌ పాత్రలో సోనాక్షి నటిస్తున్నట్టా.? లేనట్టా.? అంటే, ఏమో ఆమె అఫీషియల్‌గా కన్‌ఫామ్‌ చేస్తే కానీ తెలీదు. ప్రస్తుతం సోనాక్షి చాలా బిజీగా ఉంది. 'మిషన్‌ మంగల్‌' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. 'దబాంగ్‌ 3'లోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS