ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి చిత్రసీమని విషాదంలో ముంచెత్తింది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు.. ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు
* ''తెలుగు చలన చిత్రసీమలో భానుమతి తరవాత అంతటి ప్రతిభాశీలి విజయ నిర్మల. తన నటనతో, దర్శకత్వ ప్రతిభతో చెరగని ముద్ర వేశారు. ఆములాంటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో చూడలేం'' - చిరంజీవి
* ''విజయ నిర్మలగారు గొప్ప మార్గదర్శి. చాలా మందికి స్ఫూర్తి. ఆమెనా నా నివాళి'' - జూనియర్ ఎన్టీఆర్
* ''విజయ నిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ అనేక చిత్రాల్ని అందించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్‌రికార్డు స్థాపించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి'' - నారా చంద్రబాబు నాయుడు
* ''నాన్నగారు నటించిన పాండురంగ మహత్మ్యంలో విజయ నిర్మలగారు నటించారు. బాల నటిగా ఆమెకు అదే తొలి చిత్రం. ఆతరవాత బాలనటిగా, కథానాయికగా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. నాన్నగారితో మారిన మనిషి, పెత్తందార్లు, నిండు దంపతులు, విచిత్ర కుటుంబం చిత్రాల్లో నటించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించడం గొప్ప విషయం. ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు'' - నందమూరి బాలకృష్ణ
* ''ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించి, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు విజయ నిర్మల. ఆమె మరణం దిగ్భ్రాంతికరం'' - తలసాని శ్రీనివాస యాదవ్