ఈ మధ్య టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా షూటింగ్స్‌లో గాయాల పాలవడం ఇండస్ట్రీని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆలోచనలో పడేసింది. అయితే, షూటింగ్స్‌లో హీరోలే కాదు, హీరోయిన్లు కూడా గాయాల పాలవడం చూస్తుంటాం. అలా జేజమ్మ అనుష్క కూడా షూటింగ్‌లో గాయపడిందట. అయితే, ఈ విషయం లేట్‌గా వెలుగులోకి వచ్చింది. అనుష్క ప్రస్తుతం 'సైరా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అనుష్క నటిస్తోంది. చివరిలోనే ఈ విషయం కూడా కన్‌ఫామ్ అయ్యింది.
అనుష్క పాత్ర స్టోరీని నెరేట్ చేసే పాత్రనీ ప్రచారం జరిగింది. అయితే, పాత్ర ఏదైనా, మొత్తానికి ఈ భారీ ప్రాజెక్టులో అనుష్క కూడా ఓ భాగమైందని మాత్రం క్లారిటీ ఉంది. ఇకపోతే, చివరిగా జరిగిన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌లోనే అనుష్క కాలికి గాయమైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్. అయితే, మన హీరోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా, అనుష్క తన కాలి గాయం విషయం బయట పెట్టేందుకు ఇష్టపడలేదట. దాంతో ఈ విషయం మరుగున ఉండిపోయింది. అయితే, నిప్పుంటే పొగ ఏదో మూల నుండి వచ్చేస్తుంది కదా.
అలా కాస్త లేటైనా, జేజమ్మ గాయం విషయం బయటికొచ్చేసింది. అయితే, అనుష్క గాయం సినిమా షూటింగ్‌కి ఎలాంటి అడ్డంకి కాలేదు. కొన్ని వారాలు సాధారణమైన రెస్ట్ తీసుకోమని వైద్యులు అనుష్కకు సూచించారట. మరోవైపు అనుష్క 'సైలెన్స్' అనే బహుభాషా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాధవన్ ఈ సినిమాలో హీరో కాగా, అంజలి, షాలినీ పాండే తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.