ఈటీవీ యాంకర్‌గా ఆర్టిస్టుగా ప్రబాకర్ పాపులర్ నటుడు. ఆయన వెండితెరపై కూడా పలు చిత్రాల్లో నటించాడు. తొలిసారి ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'నెక్ట్ నువ్వే'. సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా నటిస్తున్నాడు. ముద్దుగుమ్మ వైభవి, ఆదికి జంటగా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. టైటిల్‌ని బట్టి చూస్తే ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలానే అనిపిస్తోంది. ఈ ఫస్ట్‌లుక్‌లో హీరో ఆదితో పాటు, హీరోయిన్ వైభవి ఇద్దరి ముఖాల్లోనూ ఏదో సస్పెన్స్ కనిపిస్తోంది. అందుకే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవాలి. అంతేకాదట థ్రిల్లింగ్ అంశాలతో పాటు, హిలేరియస్ కామెడీ కూడా ఉండబోతోందట. ఆది ఇటీవలే మల్టీ స్టారర్ మూవీ 'శ్యమంతకమణి'తో విజయం అందుకున్నాడు. ఈ సినిమా ఆది కెరీర్‌లో ఓ కొత్త సినిమాగా మిగిలిపోతుందంటున్నారు. ఇప్పుడొస్తున్న కామెడీ హారర్ మూవీస్ అన్నింట్లోనూ ఈ సినిమా ప్రత్యేకంగా ఉండనుందని డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రబాకర్ అంటున్నారు. బుల్లితెరపై తన టాలెంట్ చూపించిన ప్రభాకర్ వెండితెరపై డైరెక్టర్‌గా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు ఈ సినిమాతో. వి- 4 మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ త్వరలోనే వెల్లడి కానున్నాయి.