వయసు మీద పడుతున్నా తరగని అందం ఆమెది. వయసులో ఉన్నప్పుడు ఆ అందంతోనే ఎన్నో హృదయాలను కొల్లగొట్టేసింది ఆ ముద్దుగుమ్మ. వయసు పెరిగే కొద్దీ, రెట్టించిన అందంతో దుమ్ము రేపుతేనే ఉంది. ఆమె ఎవరో కాదు అందాల ఐశ్యర్య రాయ్. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా తన అందంతో చెదిరిపోని గ్లామరస్ లుక్‌తో మరిపిస్తోంది. ఇదిగో ఈ బ్లాక్ మోడ్రన్ డ్రస్సులో ఐశ్వర్య అందం రాశి పోసినట్లుగా లేదూ. అందుకే ఆమె గ్లామర్‌కి పెట్టింది పేరు. ఓ మేగ్జైన్ కోసం ఇలా మోడ్రన్ లుక్‌లో ఫోటోకి పోజిచ్చేసింది ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్.