ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'శశి'. సురభి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్లు ఆది, సురభి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్నారు.
ఆదిని ప్రేమగా కౌగలించుకొని సురభి కళ్లు మూసుకొని ఉంటే, ఆది ఆనందంగా నవ్వుతున్నాడు. ఇటీవల ఆది సాయికుమార్ బర్త్‌డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. టీజర్‌లో ఆది సరికొత్తగా కనిపిస్తున్నాడనీ, అతనికి ఈ సినిమా బ్రేక్ నిస్తుందనే నమ్మకం కలుగుతోందనీ చెప్పడంతో పాటు, ఒక ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీసినట్లు అర్థమవుతోందనీ చిరంజీవి ప్రశంసించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ చిత్రానికి అమరనాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.