ఆ హీరో సరసన హీరోయిన్‌ ఎవరంటే.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో ఆది హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీనివాస్‌ నాయుడు ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం జూలై నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. 

'ప్రేమ కావాలి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆది సాయికుమార్‌కి హీరోగా మంచి బ్రేక్‌ రాలేదింతవరకూ. ఆది కెరీర్‌లో 'లవ్‌లీ' సినిమా చెప్పుకోదగ్గ చిత్రంగా భావించాలి. అంతకు మించి ఆదికి సరైన హిట్‌ అందలేదు ఇంతవరకూ. సోలో హీరోగానే కాకుండా, 'శమంతక మణి' వంటి మల్టీస్టారర్‌ కూడా ట్రై చేశాడు ఆది. కానీ ఆ రకంగానూ సక్సెస్‌ కాలేదు. చూడాలి మరి తాజా మూవీతోనైనా ఆది ఆశించిన సక్సెస్‌ అందుకుంటాడో లేదో. 

ఇకపోతే ఈ సినిమాలో ఆది సరసన నటించబోయే ముద్దుగుమ్మ ఎవరో కన్‌ఫామ్‌ అయ్యింది. 'బీరువా' సినిమాతో తెరంగేట్రం చేసి, 'జెంటిల్‌మెన్‌' సినిమాతో పాపులర్‌ అయిన బ్యూటీ సురభిని ఆదికి జోడీగా ఎంచుకున్నారు. ఈ మధ్య సురభి కాస్త బరువు పెరిగి బొద్దుగా మారింది. అయితే ఆదికి జోడీ అంటే చాలా బరువు తగ్గాల్సి ఉంది. అందుకోసం ఈ ముద్దుగుమ్మ ఎక్కువ టైం జిమ్‌లోనే గడుపుతోందట. రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే టైంకి ఈ అందాల భామ బరువు తగ్గి నాజూగ్గా మారనుందట. తొలి సినిమాలో ఉన్నంత స్లిమ్‌గా స్టార్ట్‌గా కనిపించేందుకు వర్కవుట్స్‌ చేస్తూ తెగ కష్టపడిపోతోందట ముద్దుగుమ్మ సురభి. 

చూడాలి మరి తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్న ఆది - సురభి జంట ఆన్‌ స్క్రీన్‌ ఎలా ఆకట్టుకోనుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS