క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ 'గీత గోవిందం'

మరిన్ని వార్తలు

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' ఇప్పుడు సరికొత్త ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా. పరశురామ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. ఈ ఫస్ట్‌లుక్‌కి రెస్పాన్స్‌ అదిరిపోతోంది. 

విజయ్‌ దేవరకొండ కాళ్లు గోడకి తన్నిపెట్టి కూర్చొనగా, తన కాళ్లపై హీరోయిన్‌ కూర్చొని ఒళ్లు విరుచుకున్నట్లుగా ఉందీ లుక్‌. చిన్న గౌను వేసుకుని క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? రష్మికా మండన్నా. అవును 'ఛలో' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి రెడీ అవుతోంది. 'శ్రీరస్తు శుభమస్తు' అనే ట్రెడిషనల్‌ టైటిల్‌తో అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌తో మంచి విజయం అందుకున్న డైరెక్టర్‌ పరశురామ్‌. 

తాజా సినిమా ఫస్ట్‌లుక్‌తోనే ఆశక్తి పెంచేస్తున్నాడు. బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ ఆహ్లాదమైన మ్యూజిక్‌ అందిస్తున్నారు. క్యూట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆల్రెడీ యూత్‌లో విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా ఇద్దరికీ మంచి క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ని మరింత రెట్టింపు చేసేలా ఈ సినిమా ఉండబోతోందని ఫస్ట్‌లుక్‌ ద్వారా అర్ధమైపోతోంది. 

మరోవైపు విజయ్‌ దేవరకొండ ఈ సినిమాతో పాటు, 'ఏ మంత్రం వేశావె', 'నోటా', 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే 'మహానటి'తో విజయ్‌దేవరకొండ మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS