అమలాపాల్‌ ధైర్యానికి పోటెత్తుతున్న ప్రశంసలు!

మరిన్ని వార్తలు

డస్కీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకునే అమలాపాల్‌ త్వరలో 'ఆమె' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో 'అడాయ్‌' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్‌ లేటెస్ట్‌గా విడుదలైంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కమ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ ఈ టీజర్‌ని విడుదల చేశారు. అయితే, టీజర్‌ విడుదలైన క్షణం నుండే సెన్సేషన్‌ అయిపోయింది.

 

టీజర్‌లో అమలాపాల్‌ న్యూడ్‌ గెటప్‌లో కనిపించడం ఈ సెన్సేషన్‌కి కారణం. న్యూడ్‌గా కనిపించిందనీ, వల్గర్‌ ఫీలింగ్‌ క్రియేట్‌ చేయలేదు అమలాపాల్‌. చూసిన అందరిలోనూ తెలియని ఉత్కంఠను కలిగించింది. కూతురు కనిపించడం లేదని ఓ తల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో స్టార్ట్‌ అయిన ఈ టీజర్‌, పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌, కొన్ని ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌తో నడిచి, చివరికి అపస్మారక స్థితిలో నుండి సడెన్‌గా బయటికి వచ్చిన అమలాపాల్‌ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనిపించడం, ఆమెలో తెలియని భయం, ఆందోళన.. దగ్గర టీజర్‌ని ఎండ్‌ చేశారు. అసలెందుకు ఆమె అలా న్యూడ్‌గా కనిపించాల్సి వచ్చింది.

 

సినిమా కథేంటీ.? ఇంటి నుండి మాయమైన అమలాపాల్‌ ఎక్కడో వివస్త్రగా ఎందుకు పడి ఉంది.? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు ఈ సినిమా ద్వారా చూడబోతున్నాం. గతంలో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా ఇదే రకమైన ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. తాజా టీజర్‌ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. అందుకే అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా అమలాపాల్‌ గట్స్‌కి పొగిడ్తలతో ముంచెత్తేస్తున్నారు. అక్కినేని కోడలు సమంత టీజర్‌ చూసి, ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అని ఈగర్‌గా ఎదురు చూస్తున్నా .. అని ట్వీట్‌ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS