Aamir Khan: అమీర్ ఖాన్ సినిమాల‌కు దూర‌మైన‌ట్టేనా?

మరిన్ని వార్తలు

కెరీర్ తారు మారు అవ్వ‌డానికి ఒక్క సినిమా చాలంటారు. అలాంటి సినిమాలు అమీర్ ఖాన్ కెరీర్‌లో ఎన్నో వ‌చ్చి వెళ్లాయి.కానీ `లాల్ సింగ్ చ‌ద్దా` అమీర్ ఖాన్ సినీ జీవితం రూపు రేఖ‌ల్నే మార్చేశాయి. ఈ సినిమా భారీ డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ గా పేరు తెచ్చుకొన్న అమీర్ ఈ సినిమా ప‌రాజ‌యాన్ని జీర్ణ‌ఙంచుకోలేక‌పోతున్నాడు. అందుకే ఈ సినిమా విడుద‌ల‌య్యాక‌.. ఒక సినిమా ఒకే ఓకే చేయ‌లేదు. ఆఖ‌రికి ఒక్క క‌థ కూడా విన‌లేదు. అంతే కాదు.. కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉండాల‌న్న కీల‌క నిర్ణ‌యం తీసుకొన్నాడు అమీర్‌. యేడాది పాటు ఖాళీగా ఉండాల‌ని, ఏ సినిమా చేయ‌కూడ‌ద‌ని అమీర్ డిసైడ్ అయ్యాడు. ఈ నిర్ణ‌యం ఇప్పుడు బాలీవుడ్ అంతటా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

 

''35 ఏళ్లుగా ప‌నిచేస్తూనే ఉన్నా. ప్ర‌తీ నిమిషం సినిమా గురించే ఆలోచిస్తున్నా. ఇప్పుడు మ‌న‌సు, శ‌రీరం కాస్త విశ్రాంతి కోరుకొంటోంది. కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉండాల‌నుకొంటున్నా. ఈ కాలాన్ని నా కుటుంబంతో క‌లిసి ప్ర‌యాణించ‌డానికి వాడుకొంటా. వాళ్ల‌కంటూ కొంత స‌మ‌యం ఇస్తా`` అని చెబుతున్నాడు అమీర్ ఖాన్‌. 2024లో అమీర్ కొత్త సినిమా మొద‌ల‌వుతుంద‌ని, అంత వ‌ర‌కూ ఆయ‌న విహార యాత్ర‌ల్లో ఉంటార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. అమీర్ వ‌య‌సు ఇప్పుడు 60 ఏళ్లు. మ‌హా అయితే నాలుగైదేళ్లు అమీర్ యాక్టీవ్ గా ఉంటారేమో.? అమీర్ తీరు చూస్తుంటే సినిమాల‌కు శాశ్వ‌తంగా దూర‌మ‌య్యే ఆలోచ‌న‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. లేదంటే.. హీరో పాత్ర‌ల కోసం ఎదురు చూడ‌కుండా అమితాబ్ బ‌చ్చ‌న్‌లా క్యారెక్ట‌ర్ పాత్ర‌లు, గెస్ట్ రోల్స్ చేసుకొంటూ కాల‌క్షేపం చేసే ఉద్దేశ్యాలు ఏమైనా ఉన్నాయేమో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS