పబ్లిసిటీ స్టంట్స్ కోసం కొన్ని కొన్ని రూమర్స్ పుడుతూ ఉంటాయి. మరికొన్ని స్వయంగా పలు సెలబ్రిటీస్ క్రియేట్ చేస్తూ ఉంటారనేది తెలిసిన సంగతే. అయితే ఈ మధ్య ఓ ముద్దుగుమ్మ అనవసరంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ 'బిగ్‌బాస్' ద్వారా పరిచయమైన భామ అర్షీ ఖాన్. సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ 'బిగ్‌బాస్' సీజన్ 11లో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో తాను ప్రబాస్ నటిస్తున్న సినిమాలో నటిస్తున్నానంటూ ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తోంది. తనకి ఈ అద్భుతమైన అవకాశం రావడానికి కారణం సల్మాన్‌ఖానే. అందుకు ఆయనకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది తాజాగా. అయితే ఈ మాటలో వాస్తవం లేదనీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారట. దాంతో అర్షీఖాన్ వివరణ ఇచ్చింది. 'బిగ్‌బాస్' హౌస్ నుండి వచ్చిన తర్వాత తనకి హైద్రాబాద్ నుండి పలువురు తెలుగు నిర్మాతలు ఫోన్ చేసి మాట్లాడారనీ తెలిపింది.
అంతేకాదు ఓ బిగ్ ప్రాజెక్ట్ కోసం సైన్ చేయించుకుని వెళ్లారనీ చెబుతోంది. ఆ సినిమాలో హీరో, హీరోయిన్స్ వివరాలు గురించి ఈ ముద్దుగుమ్మ ఆరా తీయగా, మా సినిమాలో ప్రబాస్ హీరో అని సదరు నిర్మాతలు చెప్పారట. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ ఫిబ్రవరి 17 నుండి స్టార్ట్ కానుందనీ, అదే మాట నేను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నానని చెప్పుకొచ్చింది. పబ్లిసిటీ స్టంట్స్ చేయాలంటే చాలా రకాల మార్గాలున్నాయి. అంతేకానీ అబద్దాలు చెప్పాల్సిన అవసరమేముందని అభిప్రాయపడుతోందీ ముద్దుగుమ్మ అర్షీఖాన్.