మెగా అతిధిగా రానున్న చిరంజీవి

మరిన్ని వార్తలు

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ తాజా చిత్రం ఇంటెలిజెంట్ ప్రీ-రిలీజ్ వేడుక ఈ ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జరగనుంది. వచ్చే వారం 9వ తేదిన ఈ చిత్రం విడుదలకానుంది.

ఇక ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకకి మెగా అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నాడు అని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్- చమక్ చమక్ చమ్ ని రీమిక్స్ చేసిన సంగతి విదితమే. చిరంజీవి ఈ వేడుకకి అతిధిగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే- ఈ సినిమాలో హీరో సాయి ధరం తేజ్ అలాగే ఆయనకీ అత్యంత ఆప్తుడు ఇష్టుడు అయిన వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే.

 

ఇదిలావుండగా ఇంటెలిజెంట్ చిత్రం లో విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుండడం దానితో పాతుగు ఈ సినిమా టీజర్ కి సైతం పాజిటివ్ టాక్ రావడంతో ఇంటెలిజెంట్ పైన అంచనాలు పెరిగాయి. 

మరి ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ రాకతోఇంటెలిజెంట్ చిత్రానికి మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS