ముద్దుగుమ్మ సమంత ఇటు టాలీవుడ్‌లోనూ అటు కోలీవుడ్‌లోనూ కూడా స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. అయితే ఈ మధ్య సమంత రాజకీయాల్లోకి వస్తుందంటూ వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని గతంలో సమంత ఖండించింది. కానీ తెలంగాణా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తున్నారట. ఎలాగైనా సమంతని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారనీ సమాచారమ్.
ఆల్రెడీ తెలంగాణా చేనేతకు సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రతిపాదించింది కూడా ఆయనే. అలాగే ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనీ తెలుస్తోంది. తెలంగాణాలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సమంత పోటీ చేయనుందని గాసిప్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో మరోసారి సమంత స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం సమంత సినిమాలతో చాలా బిజీగా గడుపుతోంది.
తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. రెండూ ప్రెస్టీజియస్ మూవీసే. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో సమంత తొలి సారిగా జత కడుతున్న మూవీ 'రంగస్థలం'. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ అయిన 'మహానటి'లో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండూ కాక మొన్నీ మధ్యనే సమంత 'యూ టర్న్' తెలుగు రీమేక్‌కి సైన్ చేసింది. ఈ సినిమాలో కూడా సమంతది ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే. మరో పక్క తమిళంలో విశాల్‌తో ఓ సినిమాలోనూ సమంత నటిస్తోంది.
ఇలా ఇటు తెలుగులోనూ, తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత విషయంలో ఈ రాజకీయ ప్రకంపనలేంటో తెలియాల్సి ఉంది.