'బాహుబలి'తో మొదలైన ఆశ్రిత 'యాత్ర'.!

మరిన్ని వార్తలు

ఆశ్రిత వేముగంటి ఇప్పుడీ పేరు తెగ మార్మోగిపోతోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా రూపొందుతోన్న 'యాత్ర' సినిమాలో ఆశ్రిత వేముగంటి 'విజయమ్మ' పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదల చేసిన విజయమ్మ పాత్రలో ఆశ్రిత ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అచ్చు గుద్దినట్లు విజయమ్మనే తలపించింది ఆ లుక్‌లో ఆశ్రిత. ఇదిలా ఉంటే, నిజానికి ఈ ఆశ్రిత ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 'బాహుబలి' సినిమాలో 'కన్నా నిదురించరా..' అనే సాంగ్‌లో అనుష్కతో పోటీపడి డాన్సులేసింది.

 

నిజంగా చెప్పాలంటే ఆ పాటలో అనుష్కనే డామినేట్‌ చేసేసింది ఆ పాటలో ఆశ్రిత. అనుష్కకు వదిన పాత్రలో నటించింది ఆశ్రిత 'బాహుబలి' సినిమాలో. ఇక అసలు వివరాల్లోకి వెళితే ఆశ్రిత అసలు సిసలు తెలుగమ్మాయి. మల్టీ టాలెంటెడ్‌ గాళ్‌. మంచి సింగర్‌, క్లాసికల్‌ డాన్సర్‌. 'బాహుబలి' సినిమాతో ఆశ్రితకు వచ్చిన పాపులారిటీ కన్నా, ఇప్పుడు 'యాత్ర'తో పాపులారిటీ ఎక్కువగా అనిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఆశ్రిత తన స్పీచ్‌తో అందర్నీ ఆకట్టుకుంది. వైఎస్‌ భార్యగా విజయమ్మకు సినిమాలో ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉండబోతోందట. అంతకన్నా ముందే ఈమె గురించి టాలీవుడ్‌లో ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

 

ఆశ్రితపై చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయట. ఏదిఏమైనా ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా హైలైట్‌ అవుతుంటాయి. ఆ ఛాన్స్‌ 'యాత్ర' ద్వారా ఆశ్రితకు దక్కింది. చూడాలి మరి ఈ ఇంపాక్ట్‌తో ముందు ముందు ఆశ్రిత ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS