'మణికర్ణిక' దర్శకత్వం విషయంలో నేనంటే నేనంటూ కంగనా, క్రిష్ వాదోపవాదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కంగనా తన స్పందన తెలియజేసింది. 'మణికర్ణిక' నాదే అని గతంలోనూ చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. ఒకవేళ నాది అని ఎవరైనా అంటే, దాన్ని ఓపెన్‌గా ప్రూవ్ చేసుకోవాలి. అంతేకానీ, మీడియాని అడ్డం పెట్టుకుని అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదు.. అని సీరియస్‌గా కౌంటర్ ఇచ్చింది.
అలాగే ఎడిటింగ్ విషయంలోనూ కంగనాపై ఆరోపణలు వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా బయటికి వచ్చి నా పాత్ర కట్ చేసేసింద. నా పాత్ర కట్ చేసేసిందంటూ కంగనాపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కంగనా సీరియస్ కౌంటర్ ఎటాక్ చేసింది. నేను నటిగా, ఫిలిం మేకర్‌గా మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నాను. అవన్నీ నా కష్టార్జితం. నాకు వారసత్వంగా వచ్చినవి కావు. నాతో పోటీ పడాలంటే మీరు కూడా ఆ స్థాయి వారై ఉండాలి. లేదంటే ఆ స్థాయికి వచ్చి చూపించాలి.. అప్పుడు మాట్లాడాలి.. అంటూ ఓపెన్‌గా సవాల్ విసురుతోంది కంగనా.
ఏదిఏమైనా 'మణికర్ణిక' విషయంలో ఇటు కంగనా, అటు క్రిష్ ఇంకా మిగిలిన నటీనటులు రకరకాలుగా మీడియా ముందుకొస్తున్నారు. సినిమా సక్సెస్ సంగతి అటుంచితే, ఈ రకంగా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ అయితే దక్కుతోంది.