టీజర్‌ టాక్‌: ఆత్మకు 'ఆవిరి'తో సంబంధమేంటీ?

By iQlikMovies - September 28, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

వెర్సటైల్‌ దర్శకుడు రవిబాబు ఈ సారి 'ఆవిరి'తో ఆత్మకు సంబంధం పెట్టాడు. 'ఆవిరి' పేరుతో రవిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం టీజర్‌ని చిత్రయూనిట్‌ లేటెస్ట్‌గా విడుదల చేసింది. అన్ని హారర్‌ సినిమాల్లో ఉన్నట్లుగానే ఓ బంగ్లా.. అందులో ఓ ఫ్యామిలీ.. అదే బంగ్లాలో ఆల్రెడీ ఉన్న ఆత్మ.. ఇదే కథ. అయితే, ఇక్కడి ఆత్మకి, ఆవిరితో చిన్న రిలేషన్‌ షిప్‌ మెయింటైన్‌ అవుతూ వస్తుంది. ఆ రిలేషన్‌షిప్‌ ఏంటీ? ఆ ఆత్మతో ఆ ఫ్యామిలీ ఎదుర్కొనే సమస్యలేంటీ? అనేది తెలియాలంటే 'ఆవిరి' సినిమా చూడాల్సిందే.

అక్టోబర్‌లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేహా చౌహాన్‌, శ్రీముక్త, భరణీ శంకర్‌, ముక్తార్‌ ఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో. రవిబాబు స్వీయ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో నిర్మితమవుతోంది. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. పంది పిల్లని ప్రధాన తారాగణంగా చేసి సినిమా తీసిన రవిబాబు ఇప్పుడు ఆవిరితో ఆత్మకు లింకు పెట్టి సినిమా తెరకెక్కిస్తున్నాడు. రవిబాబు ఎంచుకున్న కాన్సెప్ట్‌లే విచిత్రంగా ఉంటాయి. ఇక అలాంటి కాన్సెప్ట్‌లను ఇష్టపడే వెర్సటైల్‌ ఆడియన్స్‌ కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అలాంటి వారికి డిఫరెంట్‌ థ్రిల్‌ ఇవ్వడం కోసం రవిబాబు 'ఆవిరి'తో సిద్ధంగా ఉన్నారు. గెట్‌ రెడీ ఫర్‌ దట్‌ థ్రిల్‌ii


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS