రీల్‌ కబడ్డీ కోసం 'రియల్‌' ప్రిపరేషన్‌ చేస్తోన్న మిల్కీబ్యూటీ.!

మరిన్ని వార్తలు

సంపత్‌నంది, గోపీచంద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో మిల్కీబ్యూటీ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్‌ ఇదీ.. అంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ సంపత్‌ నంది తన సినిమాల్లో హీరోయిన్స్‌ని కేవలం కమర్షియల్‌ యాంగిల్‌లోనే చూపించాడు. కానీ, ఈ సినిమాలో హీరోయిన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉండబోతోందట. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్‌ పాత్రలో నటించనుందనీ తెలుస్తోంది.

 

అందుకోసం తమన్నా రియల్‌గానే కబడ్డీలోని కొన్ని మెలకువలు తెలుసుకుంటోందట. అంతేకాదు, ఇలాంటి స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తమన్నా నటించడం ఇదే తొలిసారి కావడంతో, ఆనందంతో తెగ మురిసిపోతోందట. ప్రస్తుతం తమన్నా చేస్తున్న సినిమాలన్నీ, యాక్టింగ్‌కి స్కోపున్న పాత్రలే కావడం విశేషం. ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా'లో తమన్నా పాత్రకు చాలా చాలా ఇంపార్టెన్స్‌ ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే 'దటీజ్‌ మహాలక్ష్మి' కూడా. ఇకపై ఒప్పుకునే కొత్త ప్రాజెక్టులు కూడా అలాగే ఉండేలా చూసుకుంటోందట.

 

ఆ క్రమంలోనే సంపత్‌ నంది సినిమా ఆఫర్‌ రావడంతో, వెంటనే ఓకే చేసేసిందట. అంటే త్వరలో తమన్నాని లేడీ కబడ్డీ కోచ్‌గా చూడబోతున్నామన్నమాట. సంపత్‌ నంది దర్శకత్వంలో తమన్నా నటించిన మొదటి చిత్రం 'రచ్చ'. ఆ సినిమాలో తమన్నాతో వాన పాటను రీమిక్స్‌ చేశాడు సంపత్‌ నంది. తర్వాత 'బెంగాల్‌ టైగర్‌' చిత్రంలో తమన్నాపై చిత్రీకరించిన పాటలు విజువల్‌ అద్భుతాల్లా ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా తమన్నాపై అలాంటి సాంగ్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయచ్చా.? అంటే ఖచ్చితంగా అని సంకేతాలు వినిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS