అబిజీత్‌కి ఏమయ్యింది.? ఒక్కసారిగా ఎందుకు డల్ అయిపోతున్నాడు హౌస్‌లో.? అదే సమయంలో బయట కూడా 'వేవ్' వచ్చినట్లే వచ్చి, ఎందుకు చల్లారిపోతోంది.? ఇదే ఎవరికీ అర్థం కావడంలేదు. 'అబిజీత్, ఎనర్జీని కోల్పోవద్దు..' అని కొందరు అభిమానులు చెబుతున్నా, ఆయనపై ఆశలు సన్నగిల్లిపోతున్నాయని ఇప్పటిదాకా ఆయన్ని సపోర్ట్ చేసినవారే అంటున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా అబిజీత్ నుంచి తమ ఫోకస్‌ని ఇతర కంటెస్టెంట్స్ వైపుకి మళ్ళిస్తున్నారు.
అసలేం జరుగుతోంది బిగ్‌బాస్ లోపల? వెలుపల? ఏమోగానీ, హౌస్‌లో అఖిల్ సహా ఇతరులకు ఇస్తోన్న ఇంపార్టెన్స్‌తో పోల్చితే, అబిజీత్‌కి ఇస్తోన్న ఇంపార్టెన్స్ చాలా తక్కువగా కన్పిస్తోంది. దాంతో, అబిజీత్‌లోనూ ఒత్తిడి పెరుగుతోంది. చాలా కూల్‌గా కనిపించే అబిజీత్, ఇప్పుడు డల్‌నెస్‌తో కనిపిస్తున్నాడు. మోనాల్ విషయంలోనే అబిజీత్ ఇంతలా డల్ అయిపోతున్నాడన్నది ఓపెన్ సీక్రెట్. అబిజీత్ ఎనర్జీని టోన్‌డౌన్ చేయడానికే మోనాల్ ఇష్యూతో అఖిల్‌తో కలిపి అబిజీత్‌ని టాస్క్‌లోకి పురమాయించాడు బిగ్‌బాస్.
బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ వర్కవుట్ అయ్యింది.. హోస్ట్ నాగార్జునతోనూ, అబిజీత్‌ని టార్గెట్ చేయించడమే కాదు, అబిజీత్‌కి వున్న ఒకే ఒక్కక సపోర్ట్ హారికనీ టార్గెట్ చేయించేశారు. దాంతో, అబిజీత్‌కీ సిన్ అర్థమయిపోయింది. హౌస్‌లో ఏం చేసినా, తన పట్ల పాజిటివిటీ అటు బిగ్‌బాస్‌కిగానీ, ఇటు హోస్ట్‌కిగానీ రాదని అర్థం చేసేసుకున్నాడు అబిజీత్. అబిజీత్ అలా డిసైడ్ అయ్యాడు సరే, అభిమానులెందుకు డల్ అయినట్లో.!