ప్రభాస్ కొత్త సినిమా సంగతులు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా ఖాయమైన సంగతి తెలిసిందే. `సలార్` అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. ఫస్ట్ లుక్ చూసి.. సినీ జనాలు కొత్త కథలు అల్లేస్తున్నారు. ప్రభాస్ పాత్ర ఏమిటి? ఎలా ఉండబోతోంది? అనే విషయంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్ ఓ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే కథ ఇదని, ఓ సామాన్యుడు మాఫియా డాన్ గా ఎలా మారాడో చూపిస్తున్నారని సమాచారం. అయితే ఇలాంటి కథలు చాలా వచ్చాయి. `కేజీఎఫ్` కథ కూడా దాదాపుగా ఇలాంటిదే. కాకపోతే... పాత సినిమా ఛాయలేవీ లేకుండా ప్రశాంత్ నీల్ కొత్త కథ చెప్పబోతున్నాడట. లుక్ అయితే స్టన్నింగ్ గా ఉంది. సో... అలాంటి కథతోనే, అంత పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్‌తోనే ప్రశాంత్ మెస్మరైజ్ చేస్తాడన్న నమ్మకం అందరిలోనూ కలుగుతోందిప్పుడు.