అబిజీత్ ఏం చేస్తున్నాడు.? బయట బోల్డంత ఫాలోయింగ్ వుంది. 'అంతా మనం అనుకున్నట్లే జరుగుతోంది..' అని అబిజీత్ కుటుంబ సభ్యులు ఈ మధ్యనే ఓ ఎపిసోడ్‌లో అబిజీత్‌కి పిక్చర్ క్లారిటీ ఇచ్చేశారు. అయినాగానీ, అబిజీత్ ఎందుకో ఆ తర్వాతి నుంచీ చాలా ఇబ్బందికరంగా హౌస్‌లో మూవ్ అవుతున్నాడు. ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. అది కూడా మోనాల్ గజ్జర్ విషయంలోనే కావడం గమనించాల్సిన విషయం. మోనాల్‌తో అఖిల్‌కే ఎక్కువ రిలేషన్ వుంది అబిజీత్‌తో పోల్చితే. కానీ, అవసరానికి తగ్గట్టుగా మోనాల్‌తో ఆడుకుంటున్నాడు అఖిల్.
తన గేమ్ తాను ఆడేస్తున్నాడు. అబిజీత్ అలా కాదు. మోనాల్ విషయంలో అప్‌సెట్ అవుతూ తన గేమ్ పాడు చేసుకుంటున్నాడు. తాజాగా మోనాల్ విషయం చర్చకు వస్తే, హారికతో కూడా గొడవ పెట్టుకున్నాడు. ఇవన్నీ అబిజీత్‌కి మైనస్‌గా మారుతున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ఆల్రెడీ నామినేట్ అయి వున్న అబిజీత్, ఎలాగోలా గట్టెక్కేయొచ్చుగానీ.. ముందు ముందు మరింత టఫ్ కాంపిటీషన్ వుండబోతోంది. ఓ పక్క అఖిల్‌కి బిగ్‌బాస్ టీమ్ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్న దరిమిలా, అబిజీత్ తానేంటో ప్రూవ్ చేసుకుని తీరాల్సిందే.
వున్న ఆ ఒక్క సపోర్ట్ హారికని కూడా అబిజీత్ దూరం చేసుకుంటే, హౌస్‌లో అబిజీత్ ఒంటరిగా ఏం చేయగలడు? ఓవర్ థింకింగ్ పక్కన పెట్టి, మోనాల్‌తో కూడా చనువుగా కొనసాగడం అవసరమే అబిజీత్‌కి. కానీ, అతనలా చేయలేకపోతున్నాడు. అదే... ఆ సోలో యాక్టివిటీ, ఓవర్ థింకింగ్ వ్యవహారశైలి అతన్ని ముంచేస్తోంది ఈ సీజన్‌లో.