బిగ్ బాస్ సీజన్ 4.. క్లైమాక్స్ కి చేరుకుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు? అనే విషయంలో రకరకాల సమాధానాలు. ఒకొక్కరూ ఒకొక్కరిని సపోర్ట్ చేస్తున్నారు. చివరి వరకూ... విజేత ఎవరో గెస్ చేయడం కష్టమే. అయితే... బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ ఎవరు వస్తారు? అనే ఆసక్తి నెలకొందిప్పుడు. ఓ సీజన్‌లో వెంకటేష్ అతిథిగా వస్తే, మరో సీజన్ లో చిరు సందడి చేశాడు. వెంకీ, చిరుల ఎంట్రీ.. బిగ్ బాస్ షోకి మరింత అందాన్ని తీసుకొచ్చింది.
మరి ఈసారి ఎవరు వస్తారు? ఆ ఛాన్స్ ఎవరికి ఉంది? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఈసారి.. అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌లలో ఒకరు... ఫైనల్ వేదికపై కనిపించే ఛాన్స్ ఉందని, నాగచైతన్య కూడా రావొచ్చని ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్, మహేష్‌ల లో ఎవరు వచ్చినా... ఫైనల్ షో అదిరిపోవడం ఖాయం. నాగ్ అడిగితే.. ఎవరైనా సరే, ఈ షోకి వస్తారు. అయితే.. భయం ఒకటే. కరోనా. ఈ భయాన్ని దాటుకుని ఎవరు వస్తారో చూడాలి.