చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన 'ట‌క్ జ‌గ‌దీష్‌'

By iQlikMovies - December 04, 2020 - 15:13 PM IST

మరిన్ని వార్తలు

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ట‌క్ జ‌గ‌దీష్' షూటింగ్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది. నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన చివరి షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు.

 

ఈ సినిమాలో రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్ లో నటిస్తుండగా, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్,ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.. ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS