కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే మ్యాజిక్ చేస్తాయి. కంటెంట్ బావుంటే చిన్న సినిమా వైపు కూడా పెద్ద చూపు పడుతుంది. ఇప్పుడు 'అరి' అనే సినిమా కూడా అలానే మ్యాజిక్ చేసింది. అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రమిది. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ క్యురియాసిటీని పెంచాయి.
తాజాగా ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ కు ప్రత్యేకంగా చూపించాడట దర్శకుడు.ఈ సినిమా చూసిన అభిషేక్ చాలా ఎక్సయిట్ అయ్యారు. కాన్సెప్ట్ నచ్చి రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీ రీమేక్ ను కూడా జయశంకరే డైరెక్షన్ చేసే అవకాశం వుంది. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈలోగ అభిషేక్ బచ్చన్ రూపంలో రీమేక్ డీల్ రావడం అదృష్టమనే చెప్పాలి.