టక్కర్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: టక్కర్
నటీనటులు: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్
దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
 

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
ఛాయాగ్రహణం: వాంచినాథన్ మురుగేశన్
కూర్పు: జీఏ గౌతమ్
 

బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్
విడుదల తేదీ: 9 జూన్ 2023

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2/5
 

డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ యాక్టర్ గా మారాడు సిద్ధార్థ్‌. బొమ్మరిల్లి లాంటి క్లాసిక్ తో తెలుగులో కూడా చాలా పేరు తెచ్చుకున్నాడు. ఐతే మళ్ళీ అలాంటి విజయం రాలేదు. చేసిన సినిమాలన్నీ దాదాపుగా నిరాశ పరిచాయి. కొన్ని ప్రయోగాలు సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఐతే సిద్దు మాత్రం నటుడిగా ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఇప్పుడు ‘టక్కర్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా సిద్దుకి పునర్వైభవం తీసుకొచ్చిందా ? సిద్దు ఖాతాలో ఓ హిట్ పడింది ?


కథ: గుణశేఖర్‌ అలియాస్ గున్స్ (సిద్ధార్థ్‌) ఓ పేదింటి కుర్రాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవ్వాలన్న ఉద్దేశంతో వైజాగ్‌కు వచ్చి.. ఓ చైనా వ్యక్తి నడిపే కార్ల కంపెనీలో డ్రైవర్‌గా చేరుతాడు.  ఓరోజు అనుకోకుండా ఆ కారుకు యాక్సిడెంట్‌ అవ్వడంతో గున్స్ ని చైనా ఓనర్  దారుణంగా కొట్టి అవమానిస్తాడు. దీంతో జీవితం మీద విరక్తి చెంది సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ధైర్యం సరిపోదు. దీంతో వైజాగ్‌లోనే పేరు మోసిన రాజ్‌ (అభిమన్యు సింగ్‌) అనే పెద్దగ్యాంగ్ స్టర్ అడ్డాకు వెళ్లి వాళ్లతో గొడవ పడితే వాళ్ళే చంపేస్తారని అనుకుంటాడు. వాళ్ళతో గొడవ పడే క్రమంలో అక్కడ ఓ కారును ఎత్తుకొచ్చేస్తాడు. అయితే ఆ కారు డిక్కీలో లక్కీ (దివ్యాంశ కౌశిక్‌) ఉంటుంది. మరి ఆమె ఎవరు? ఆమెని ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? ఆమె గున్స్ జీవితంలోకి ప్రవేశించాక ఏం జరిగింది? చివరికి వీరి ప్రయాణం ఏ తీరాలకు చేరింది ? అనేది తక్కిన కథ. 


విశ్లేష‌ణ‌: ఈ కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ పేదింటి కుర్రాడు ధవంతుడు కావడానికి ఎలాంటి ప్రయాణం చేశాడు? అనేది ఇందులో పాయింట్. ఈ పాయింట్ తోనే కథని మొదలుపెట్టాడు దర్శకుడు. గన్స్ పాత్ర పరిచయం, అతని పేదరికం, డబ్బు సంపాయించాలానే లక్ష్యం ఇవన్నీ మెల్లగా  కథలోకి తీసుకెల్తాయి. షాట్ కట్ లో డబ్బు సంపాయించడానికి కిడ్నాపర్స్ తో ఓ డీల్ సెట్ చేయడం, ఆ క్రమంలో వచ్చే చేజింగ్ సీన్ రక్తికట్టిస్తాయి. ఐతే తర్వాత ఈ కథకు సడన్ బ్రేక్ పడుతుంది. ఇక అక్కడి నుంచి కథ ముందుకు వెళ్ళదు. కారు యాక్సిడెంట్, హీరో చనిపోవాలని అనుకోవడం.. ఈ కథని పక్కదారి పట్టిస్తాయి. ఐతే హీరోయిన్ కారులో దొరకడంతో ఈ కథలో మరో మలుపు ఊహిస్తాడు ప్రేక్షకుడు. కానీ అలాంటి టర్న్ ఏమీ ఇందులో వుండదు. 


మొదటి సగంలో ఎదో రకంగా నెట్టుకొచ్చిన దర్శకుడు రెండో సగంలో దీనిని రోడ్‌ జర్నీ యాక్షన్‌ థ్రిల్లర్‌లా మలచాలని ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యాడు.  


సెకండాఫ్‌ లో వచ్చే లవ్ ట్రాక్ సినిమా ప్రధాన లోపంగా మారింది. ఈ ప్రేమకథలో ఫీల్ లేదు. అటు హీరో - విలన్‌ల మధ్య ఎమోషన్ వర్క్ అవుట్ కాలేదు. విలన్ గ్యాంగ్ తో కామెడీ చేయాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. అలాగే చివరి ఇరవై నిముషాలు ఈ సినిమా అనవసరం. ఎలాంటి మలుపు లేని ఆ ప్రేమకథతో మరో ఇరవై నిముషాలు ప్రేక్షకులు సహనానికి పరీక్షపెట్టాడు దర్శకుడు. 


నటీనటులు: గున్స్ పాత్రలో  సిద్ధార్థ్‌  కొత్తగా కనిపిస్తాడు. తన గెటప్ కూడా కొత్తగా వుంది. ఐతే సెకండ్ హాఫ్ లో మళ్ళీ లవర్ బాయ్ సిద్దు తెరపైకి వస్తాడు.  దివ్యాంశ తెరపై అందంగా కనిపించింది. మరీ పొట్టి బట్టలు కట్టించినట్లు వున్నారు. చాలా చోట్ల బ్లర్ పడింది. అభిమన్యు సింగ్‌ పాత్రని చివర్లో డమ్మీగా మార్చేశారు. యోగిబాబు కామెడీ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదు. మిగతా నటీనటులు పరిధిమేరకు చేశారు. 


టెక్నికల్: పాటలు ఈ సినిమా మైనస్ గా మారాయి. ఏ పాట కూడా గుర్తుపెట్టుకునేలా లేదు. నేపధ్య సంగీతం ఓకే. కెమరాపనితనం మెప్పిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథలో బలం లేదు. సెకండ్ హాఫ్ మొత్తాన్ని లక్ష్యం లేకుండా చేయడం కూడా ఈ సినిమాకి ప్రధాన మైనస్ గా మారింది. 


ప్లస్ పాయింట్స్ 
సిద్ధార్థ్‌, దివ్యాంశ కౌశిక్ నటన 
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు 


మైనస్ పాయింట్స్ 
బలహీనమైన కథ కథనం 
సెకండ్ హాఫ్ , 
పాటలు 


ఫైనల్ వర్దిక్ట్: ట్రాక్ తప్పిన టక్కర్...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS