తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన హీరోలు నిన్న రాత్రి సమావేశం అవ్వడంతో ఇక పై చిత్రపరిశ్రమలో హీరోలందరూ ఒకే మాట పైన నడుస్తారు అన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది.
అయితే ఈ మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నది? ఏ మీటింగ్ నిర్ణయించుకుంది? అన్నవాటి గురించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలాఉండగా వీరందరూ త్వరలోనే మరోసారి సమావేశం అవ్వనున్నారు అని, అందులో వారు తమ కార్యాచరణ అలాగే భవిష్యత్తులో ఇటువంటి సందర్భాలలో ఎలా వ్యవహరించాలి అన్న దాని పైన కొన్ని నిర్ణయాలు తీసుకోన్నున్నారట.
ఇక ఆ వివరాలని మీడియాతో కూడా పంచుకోన్నునారు అని కూడా సమాచారం. గత కొంతకాలంగా మీడియాకి తాము “సాఫ్ట్ టార్గెట్” అవుతున్నాము అన్న భావన వాళ్ళకి రావడంతోనే ఈ అత్యవసర భేటీకి సిద్ధమయ్యారట.
త్వరలోనే వీరి రెండవ సమావేశం జరగనుంది అని సమాచారం.