బిగ్ బాస్ అంటేనే ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఈ షో ఇప్పటికి మన దేశంలో ప్రారంభించిన అన్ని బాషలలోను విజయవంతమైంది. ఇక బిగ్ బాస్ సీజన్ మొదలైందంటే టీవీ చూసే ప్రేక్షకులకి ఒక మూడు నెలల పాటు కాలక్షేపం దొరికేసినట్టే అని చెప్పొచ్చు.
ఇదిలావుండగా బిగ్ బాస్ తమిళం సీజన్ 2కి సంబంధించి ఒక సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అది ఆ షోకి సంబందించినది కాకపోయినా ఆ షో నిర్వహణకి పనిచేస్తున్న వారిది కావడంతో అందరి దృష్టి ఆ వార్త పైన పడింది.
ఇంతకి ఏం జరిగిందంటే- బిగ్ బాస్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఏసీ లో సమస్య తలెత్తగా దానిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్న గుణశేఖరన్ ప్రమాదవశాత్తు సెకండ్ ఫ్లోర్ నుండి క్రింద పడిపోవడంతో తలకి తీవ్రగాయం అయింది. వెంటనే అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తున్నది.
ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.