కౌశల్ & శ్యామల- బిగ్ బాస్ ‘గుడ్డు’ స్టార్స్

By iQlikMovies - September 09, 2018 - 17:47 PM IST

మరిన్ని వార్తలు

ప్రతి వారాంతంలో బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ నాని... ఇంటి సభ్యులతో ఏదో ఒక ఫన్నీ టాస్క్ చేయిస్తూనే ఉంటాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఆయన ఇంటి సభ్యుల చేత గుడ్డు టాస్క్ ఆడించాడు.

ఈ సీజన్ మధ్యలో గుడ్డుని నామినేట్ చేసేందుకు ఇవ్వగా నిన్న మాత్రం ఎవరి తలపైన వారినే గుడ్డుని కొట్టించడం నిన్నటి ఎపిసోడ్ కే హైలైట్ అని చెప్పొచ్చు. అయితే ఈ టాస్క్ లో భాగంగా మన గురించి మనం ఏమనుకుంటున్నామో అదే సమయంలో వేరే సభ్యులు ఏమనుకుంటున్నారో... వీరిరువురి ఆలోచనలు ఒకేలా ఉన్నాయా అనేది ఈ టాస్క్ ఉద్దేశ్యం.

ఇక దీప్తి, సామ్రాట్ లు ఇద్దరు ఒక్క గుడ్డు కూడా కొట్టించుకోకుండా బయటపడితే రోల్ రైడా & తనీష్ లు ఒక గుడ్డు, గీత మాధురి, అమిత్ లు రెండు గుడ్లు, కౌశల్ & శ్యామల నాలుగు గుడ్లు పగలగోట్టుకోవాల్సి వచ్చింది.

దీనితో ఈ ఇద్దరు నిన్నటి ఎపిసోడ్ లో ‘గుడ్డు’ స్టార్స్ గా మిగిలారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS