స్టూడెంట్ నెంబర్1 - సుబ్బు
సింహాద్రి - ఆంధ్రావాలా
సై - అల్లరి బుల్లోడు
ఛత్రపతి - పౌర్ణమి-యోగి
విక్రమార్కుడు - ఖతర్నాక్
యమదొంగ- కంత్రి
మగధీర - ఆరంజ్
ఈగ- ఏటో వెళ్ళిపోయింది మనసు
బాహుబలి- సాహో, రాధేశ్యామ్
ఈ లిస్టు గురించి మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. మొదటిది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన హిట్టు సినిమా. తర్వాత ఆ సినిమా హీరోకి తగిలిన ఫ్లాపు. ఈ లిస్టులో ఇప్పుడు మరో సినిమా చేరిపోయింది. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ చేసిన ఆచార్య డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. చాలా దారుణమైన రివ్యూలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశ చెందారు. ''అసలు ఇది మా బాసు సినిమానేనా ?' అని తలలు పట్టుకున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా మెగాస్టార్ రాజమౌళి ఫ్లాఫ్ సెంటిమెంట్ ని గుర్తు చేసి.. ఆచార్యకి అలా జరగదని.. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు. కానీ మెగాస్టార్ నమ్మకం వొమ్మాయింది. రాజమౌళి సెంటిమెంట్ నే గెలిచింది. ఏదేమైనా చరణ్- చిరు కలసి చేసిన సినిమా ఇంత దారుణంగా దెబ్బకొట్టడం ఫ్యాన్స్ ని చాలా డిస్సాపాయింట్ చేసింది.