చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం `ఆచార్య`. కాజల్ కథానాయిక. ఆగస్టులోనే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ వల్ల వీలు పడడం లేదు. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంది. సంక్రాంతికి రాజమౌళి `ఆర్.ఆర్.ఆర్` విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్రాంతికే వస్తాం.. అంటూ రాజమౌళి కూడా చెబుతూ వస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం.. ఆర్.ఆర్.ఆర్. సంక్రాంతికి రావడమే సరైన నిర్ణయం. అందుకే.. సంక్రాంతి రేసులో నిలిచింది. ఆర్.ఆర్.ఆర్ తో పాటు మరో సినిమాకీ సంక్రాంతికి ఛాన్స్ ఉంది. ఆ ప్లేసుని ఆచార్య భర్తీ చేయాలనుకుంటోంది.
ఎఫ్ 3 లాంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలవాలనుకున్నా... వాటికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎఫ్ 3 ప్రాజెక్టే ఇంకా ఫైనల్ కాలేదు. ఆచార్య ఆలా కాదు. స్క్రిప్టు రెడీ. కొంతమేర షూటింగ్ కూడా జరిగింది. సో.. ఆచార్య విడుదలకు ఢో కా లేనట్టే. కాకపోతే చిరు, చరణ్ సినిమాలు ఒకే సీజన్‌లో పోటీ పడడాన్ని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.