చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య`. రామ్ చరణ్ ఓ కీలక పాత్రధారి. కాజల్, పూజా హెగ్డే కథానాయికలు. మే 13న ఈ చిత్రం విడుదల కావాల్సివుంది. అయితే... కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వల్ల వాయిదా పడిపోయింది. ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజుల వరకూ పెండింగ్ లో ఉందని, కరోనా లేకపోయినా ఈ సినిమా వాయిదా వేయాల్సివచ్చేదన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. దీనిపై.. కొరటాల శివ స్పందించారు. ఆచార్య షూటింగ్ మరో పది రోజుల మాత్రమే బాకీ ఉందని క్లారిటీ ఇచ్చారు.
షూటింగులకు ఎప్పుడు అనుమతులు వస్తే, అప్పుడు ఆ పది రోజుల షెడ్యూల్ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర నిడివిపై కూడా కొరటాల మాట్లాడారు. ఈ సినిమాలో చరణ్‌ది అతిథి పాత్ర కాదని, ఆయన సెకండాఫ్ అంతా కనిపిస్తారని చెప్పారు కొరటాల. ఇప్పటికే ఆచార్య నుంచి ఓ పాట విడుదలైంది. త్వరలోనే మరో రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేయబోతున్నార్ట. అందుకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు.