కథానాయికల పెళ్లి ముచ్చట కంటే.. ఆసక్తికరమైన విషయాలేం ఉంటాయి. ఆ కబుర్లు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. వాటి చుట్టూ ఎన్ని గాసిప్పులు వండినా, ఎప్పటి కప్పుడు మరికొన్ని పుట్టుకొస్తూనే ఉంటాయి. అనుష్క విషయమే తీసుకోండి. తన పెళ్లి సంగతి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగే. ప్రభాస్‌తో అనుష్క పెళ్లి అన్నారు. అది ఉత్తిదే అని తేలిపోయింది. ఆ తరవాత కూడా.. అనుష్క పెళ్లి కబుర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు అలాంటి ముచ్చటే మరోటి బయటకు వచ్చింది. దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్తతో అనుష్క పెళ్లి కుదిరిందని, పెళ్లయ్యాక అనుష్క దుబాయ్ వెళ్లిపోతుందని వార్తలొస్తున్నాయి. ఎప్పటిలానే.. ఈసారి మౌనంగానే ఉంది అనుష్క. అస్తమానూ ఏం మాట్లాడతాం? అని ఊరుకుందో, లేదంటే కరోనా సమయంలో ఇలాంటి విషయాలపై మాట్లాడడం నచ్చక వదిలేసిందో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే అనుష్క పెళ్లి గోల మళ్లీ మొదలైపోయింది. ఇదెంత కాలమో చూడాలి.