తమిళ హీరో విశాల్ హీరోగా 'చక్ర' అనే సినిమా లాంఛనంగా స్టార్ట్ అయ్యింది. రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ శుక్రవారం విశాల్ నటిస్తున్న 'యాక్షన్' మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజే మరో కొత్త సినిమాని విశాల్ పట్టాలెక్కించేయడం విశేషం. తమన్నా, ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి సుందర్.సి దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. తెలుగులోనూ ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేశారు. యూనివర్సల్ యాక్షన్ బేస్‌డ్ మూవీ కావడంతో, తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా తమన్నా అంద చందాలు ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్‌గా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, రిలీజ్ దగ్గర పడ్డాక, ఆడియన్స్‌లో మరింత ఆసక్తి రేకెత్తించేలా కొత్త పోస్టర్ విడుదల చేసింది 'యాక్షన్' టీమ్. ఈ పోస్టర్‌లో విశాల్ ఓ టెర్రరిస్ట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. చేతులకు సంకెళ్లు వేసి, పోలీసులు ఆయన్ని తీసుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతవరకూ యాక్షన్ మోడ్‌లోని పోస్టర్లే రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, తాజా పోస్టర్‌ని రిలీజ్ చేసి, సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశారు. క్లీన్ షేవ్‌లో మాత్రమే కనిపించిన విశాల్, ఈ పోస్టర్‌లో గుబురు గెడ్డంతో కనిపిస్తుండడంతో, ఒకవేళ విశాల్ డబుల్ 'యాక్షన్' ఏమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డైలమా తీరాలంటే, ఆలస్యం చేయకుండా 'యాక్షన్' మూవీని ధియేటర్స్‌లో వీక్షించడమే.!