బిగ్ బాస్ 1కి ఎన్టీఆర్ హోస్ట్ అయ్యాడు. ఆ షో హిట్టు. బిగ్ బాస్ 2కి నాని హోస్ట్ అయ్యాడు. కొన్ని ఆటు పోట్లు ఎదురైనా ఈ షోని బాగానే నడిపించేశాడు నాని. బిగ్ బాస్ 3కి నాగార్జున హోస్ట్ అయ్యాడు. తొలుత నాగ్ కూడా కొంత ఇబ్బంది పడ్డాడు. కంటెస్టెంట్లతో కలవలేకపోతున్నాడని, వన్ సైడ్ గా మాట్లాడుతున్నాడని అనిపించింది. చివరికి పెద్దగా వివాదాల జోలికి వెళ్లకుండా ఈ షోని కామ్‌గా ముగించేశాడు. కానీ విచిత్రం ఏమిటంటే.. బిగ్ బాస్ 3 ఫైనల్స్‌కి అదిరిపోయే రీతిలో రేటింగులు వచ్చాయి. టీ.ఆర్.పీ రేటింగుల్లో బిగ్ బాస్ 3నే ముందుంది.
ఫైనల్స్‌కి ఏకంగా 11.9 రేటింగొచ్చింది. బిగ్ బాస్ 1 ఫైనల్స్‌కి 9.4 రేటింగ్ వస్తే సీజన్ 2కి 9.5 వచ్చింది. అంటే.. ఆ రెండు సీజన్లతో పోలిస్తే... ఈ సీజన్ ని ఎక్కువ మంది చూసినట్టే. ఆ లెక్కల్లో బిగ్ బాస్ 3 హిట్టయినట్టే అనిపిస్తోంది. సీజన్ విన్నర్ ఎవరో.. ముందే లీక్ అయిపోయింది. రాహుల్‌ని విన్నర్‌గా ప్రకటించనున్నారని మీడియాకు ఉప్పందేసింది. అయినా సరే, ఫైనల్స్‌ని ఈ స్థాయిలో చూశారంటే అది నాగ్ చేసిన మ్యాజిక్కే అనుకోవాలి.