నందమూరి నట సింహాం బాలయ్య వారసున్ని దించడంలో గ్యారంటీ ఇవ్వలేకున్నా, తన వంతు కృషి తాను చేయడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తున్నాడు. గ్యాప్ లేకుండా సినిమలు చేస్తూనే ఉన్నాడు. సక్సెస్, ఫెయ్యిూర్తో సంబంధం లేకుండా, ఎలాంటి నిరుత్సాహం లేకుండా కొత్త కొత్త ప్రాజెక్టుల్ని సైతం ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి ప్రాజెక్టు సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో బాలయ్య కనిపిస్తున్నారనీ సమాచారం.
ఇదిలా ఉంటే, మరోవైపు బాలయ్య ఇంకో మాస్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చే పనిలో ఉన్నాడనీ తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, గతంలో బాలయ్యతో ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘నరసింహనాయుడు’, ‘సమరసింహారెడ్డి’ వంటి కెరీర్ బెస్ట్ మూవీస్ అందించిన దర్శకుడు బి.గోపాల్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేసి, కాసుల వర్షం కురిపించాయి. అయితే, ఇప్పుడు బి.గోపాల్లో అంతటి జోష్ లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత గోపీచంద్‌తో ‘పంతం’ సినిమా రూపొందించిన ఆయన ఫెయిల్యూర్ చవి చూశారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం బాలయ్య పిలిచి మరీ బి.గోపాల్‌కి ఛాన్సిచ్చారని తెలియడంతో, గోపాల్లో మునుపటి జోష్ ఉరకలేస్తోందట. అంటే, ఈ కాంబినేషన్లో ఓ సూపర్ హిట్ పడుతుందా.? అలా అయితే, అది ఇటు బాలయ్యకీ, అటు గోపాల్కీ కూడా కలిసొస్తుంది. చూడాలి మరి. ఏం జరుగుతుందో.