'సైరా' కోసం చాలా మంది చాలా చేశారు. వాటిలో కొన్ని శాక్రిఫైసెస్ అయితే, మరికొన్ని డెడికేషన్స్. అందులో నటుడు బ్రహ్మాజీ గురించి ముందుగా చెప్పుకోవాలి. బ్రహ్మాజీ 'సైరా'లో ఓ కీలక పాత్ర పోషించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అనుచరుడి పాత్ర అది. కొన్ని సన్నివేశాల్లో బ్రహ్మాజీ పండించిన ఎమోషన్ చాలా కనెక్టింగ్‌గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సాయి చరణ్ సినిమా కోసం గెడ్డం పెంచాడట. ఈ సినిమాలో నటిస్తున్న తరుణంలోనే ఇంకో సినిమా ఆఫర్ వచ్చిందట.
అయితే, ఆ సినిమాలో గెడ్డం లేకుండా కనిపించాలట. అందుకోసం గెడ్డం తీసేయమనీ, అవసరమైతే, 'సైరా' కోసం ఆర్టిఫిషియల్ గెడ్డం పెట్టుకోవచ్చులే అని చిరంజీవితో సహా అందరూ సూచించారట. కానీ, సాయి చరణ్ అందుకు ఒప్పుకోలేదట. నేచురాలిటీ మిస్ అవుతుందని గెడ్డం తీయలేదు.. కదా వచ్చిన ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ని వదులుకున్నాడట. అలా చాలా మంది ఆర్టిస్టులు కొన్ని కొన్ని అవకాశాలు వదులేసుకున్నారనీ, అది వారి డెడికేషన్‌కి నిదర్శనం.. అని చిరంజీవి చెప్పారు. ఇక బ్రహ్మాజీ ఏం చేశాడంటే, ఏకంగా గుండే గీయించేసుకున్నాడట. సినిమా స్టార్టింగ్ నుండి, చివరి వరకూ దాదాపు చిరంజీవి పక్కన కనిపిస్తాడు బ్రహ్మాజీ. ఒకానొక సన్నివేశం కోసం గుండు చేయించుకోవాల్సి వస్తుంది.
ఆ సీన్ కోసం రియల్‌గానే గుండు చేయించేసుకున్నాడు బ్రహ్మాజీ. ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ, సైరా సెట్‌లో గుండు చేయించుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బ్రహ్మాజీ. ఈ సినిమాకి ముందు ఏదో ఒక చిన్న పాత్ర ఇప్పించమని చరణ్‌ని కోరాడట బ్రహ్మాజీ. అయితే, అంత ఇంపార్టెంట్ పాత్ర ఇస్తాడని కలలో కూడా ఊహించలేదట. అలాంటి చరణ్ కోసం, చిరంజీవి పక్కన ఇలాంటి సినిమాలో నటించే గొప్ప అవకాశాన్ని తనకు కల్పించినందుకు ఆ రుణం ఎలా తీర్చుకోగలను.. అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు నటుడు బ్రహ్మాజీ.