తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ముఖానికి రంగేసుకుని, బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగ రాసిన స్టార్ మెగాస్టార్. 151 వ సినిమాతో చరిత్ర సృష్టించాడు. చరిత్రలో ఆయన లేకపోయినా, చరిత్ర మనతోనే మొదలవ్వాలి అన్న డైలాగ్ ఏదో సినిమా కోసమో, లేక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసమో చెప్పించిన డైలాగ్ కాదు. ఆయన కోసం అభిమానులు చెప్పించిన మాటే బుర్రా సాయిమాధవ్ రాతల్లోంచి ఆయన నోట డైలాగ్‌గా వచ్చింది.
అయితే, రీల్ మెగాస్టార్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. రియల్ మెగాస్టార్ జీవితం గురించి కూడా కొంత తెలిసిందే. అయినా, తెలుసుకోవల్సింది చాలా ఉందట. రీల్‌ని వదిలి, రాజకీయాల్లోకి వెళ్లాక ఆయన ప్రజలతో చెప్పాలనుకున్న మాటలు పంచుకోవాలనుకున్న కీలక అంశాలు చాలా ఉన్నాయట. కానీ, అలా పంచుకునేందుకు రియల్ లైఫ్‌లో అవకాశం రాలేదట. అందుకే ఆ తెర వెనక విషయాలన్నీ తెరపై బయోపిక్ రూపంలో పంచుకోవాలనుకుంటున్నారట చిరంజీవి. అందుకే ఆయన బయోపిక్ తెరకెక్కిస్తానంటోన్న వారిని చిరు ఎంకరేజ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది.
త్వరలోనే చిరంజీవి బయోపిక్ తెరపై సందడి చేయబోతోందని తెలుస్తోంది. ఇదేమీ గాలి మాట కాదు.. స్వయంగా చిరు నోట నుండి రాలిన రత్నాల మాట. అయితే, ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఎవరు పోషిస్తారనేదే చిన్న సస్పెన్స్. అఫ్‌కోర్స్.. అక్కడ కూడా పెద్దగా సస్పెన్స్ లేదనుకోండి. ఎవరు నటిస్తే బాగుంటుందో అది కూడా చిరు చెప్పేశారు. సో సాయి ధరమ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ, వరుణ్ తేజ్ కానీ నటించే అవకాశాలున్నాయి. వీరిలో ఎవరనేది కన్‌ఫామ్ కావడానికి పెద్దగా టైం కూడా పట్టదులెండి.