ఫిబ్రవరి నెలలో వస్తున్న స్టాలిన్

By iQlikMovies - January 27, 2020 - 17:19 PM IST

మరిన్ని వార్తలు

విధ్యభరిత చిత్రాలనే కాదు మాస్ చిత్రాలను చేస్తూ ఆల్ రౌండ్ కధానాయకుడిగా జీవా పేరుపొందారు. అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎంతో దగ్గరయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం పేరు స్టాలిన్. దీనికి అందరివాడు ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది.మరో కథానాయకిగా గాయిత్రి కృష్ణ కనిపిస్తుంది. ప్రముఖ తెలుగు హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్రలో నటించడం ఓ విశేషం.

 

రతిన శివ దర్శకత్వం వహించారు. తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ, ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న ఒకే రోజున ఈ చిత్రం భారీగా విడుదలకానుంది. ఇదే చిత్రం తమిళంలో సీరు పేరుతో విడుదలవుతుంది. రంగం చిత్రం తర్వాత ఆ స్థాయిలో తీయబడిన మాస్ చిత్రమిది. జీవా తన పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై...దాని ఎదుర్కొంటారు కధానాయకుడు జీవా. అందరికీ ఆప్తుడిగా మెలగుతూ చెడుపై పోరాటం చేసే పాత్ర ఆయనిది. ఇక నవదీప్ ప్రతినాయకుడిగా ఎంతగానో ఒదిగిపోయారు. కధానాయికలు తమ పాత్రలలో మెప్పిస్తారు. కధానాయిక రియా సుమన్ ఇప్పటికే తెలుగులో మజ్ను, పేపర్ బాయ్ చిత్రాల్లో నటించారు. 15 కోట్ల భారీ వ్యయంతో ఎక్కడ తగ్గకుండా కథ డిమాండ్ కు అనుగుణంగా ఖర్చు పెట్టడం జరిగింది.

 

ఫిబ్రవరి 2న ఆడియోను విడుదల చేయనున్నాం. చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు అని చెప్పారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS