కృష్ణుడుకి కోపమొచ్చిందండోయ్‌.!

By iQlikMovies - April 19, 2018 - 07:00 AM IST

మరిన్ని వార్తలు

'వినాయకుడు' తదితర సినిమాల్లో నటించిన నటుడు భారీ కాయుడైన కృష్ణుడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఎందుకంటే శ్రీరెడ్డి పవన్‌ కళ్యాణ్‌ తల్లి మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడమే. ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో కృష్ణుడు సుదీర్ఘమైన లేఖ రాశాడు. అందులో తన ఆవేదనను బయటపెడుతూ, సినీ పరిశ్రమకి ఓ సలహా ఇచ్చాడు. 

సలహా కాదది. అభ్యర్ధన. అభ్యర్ధన కూడా కాదు, అదొక హెచ్చరిక. ఈ రోజు పవన్‌ కళ్యాణ్‌ తల్లి. రేపు ఇంకో హీరో తల్లి. మహేష్‌ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు. శ్రీరెడ్డి నోటికి వచ్చిన విధంగా తిట్టేస్తోంది. సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ శ్రీరెడ్డి తీరును ఖండించాలి. సినీ పరిశ్రమపై ఆమె ఆభాండాలు వేస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన నటుడిగా నేను చాలా బాధపడుతున్నాను. సినీ కళామతల్లి బిడ్డలం, మేమంతా ఒకే కుటుంబ సభ్యులమని చెప్పుకుంటున్నాం. కానీ ఆ తల్లిని దూషిస్తోంది. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో పరిశ్రమ పరువును దిగజార్చేస్తోంది. మీకెవ్వరికీ బాధనిపించడంలేదా? అనిపిస్తే, వెంటనే స్పందించండి. ఓ హీరోకి సంబంధించిన విషయం మాత్రమే కాదిది. ఇది మన సమస్య. మనందరి పరువు, ప్రతిష్ఠల సమస్య అని కృష్ణుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఈ విషయంలో సినీ పరిశ్రమ నుండి జీవితా రాజశేఖర్‌ స్పందించిన తర్వాత ఒక్కొక్కరుగా బయటికి వచ్చే సాహసం చేస్తున్నారు. ఆల్రెడీ సోషల్‌ మీడియా వేదికగా పవన్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు యంగ్‌ హీరోస్‌ అయిన నితిన్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, రామ్‌చరణ్‌ తదితరులు స్పందించారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS