తమిళ హీరో మాధవన్ మంచి నటుడు. ఆయన ఏ పాత్ర పోషించినా, ఆ పాత్రకు అందం తీసుకురావడంతో పాటు, పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ఫ్యామిలీ హీరోగా మాధవన్‌కి మంచి పేరుంది. అంతేకాదు, మిగిలిన ఏ విలక్షణ పాత్రైనా మాధవన్ రక్తి కట్టించగలడు. 'సవ్యసాచి'లో ఆయన విలనిజంతో ఎలా కట్టి పడేశాడో తెలిసిందే కదా. ఇకపోతే, ఇంత గొప్ప నటుడి తనయుడు మాత్రం స్విమ్మర్‌గా రాణిస్తున్నాడు.
యాక్టర్ కొడుకు యాక్టరే అవ్వాలి. డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలి అనే రూలేమీ లేదు.. అనడానికి మాధవన్ కొడుకే బెస్ట్ ఎగ్జాంపులేమో. చిన్నతనం నుండీ మాధవన్ కొడుకు స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాల మీద పతకాలు సాధిస్తున్నాడు. గతేడాది థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి జూనియర్ ఈత పోటీల్లో కాంస్య పతకం సాధించిన ఈ బుడ్డోడు, ఈ ఏడాది ఏకంగా మూడు బంగారు, ఒక వెండి పతకం సాధించి రికార్డు సృష్టించాడు.
స్విమ్మింగ్‌లో అశేషమైన ప్రతిభ కనబరుస్తోన్న మాధవన్ కొడుకు, ఫ్యూచర్ హీరో అవుతాడా.? చూడాలిక. మాధవన్ ప్రస్తుతం 'సైలెన్స్' మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అంజలి, షాలినీ పాండే తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.