స్టన్నింగ్‌ లుక్‌: నవదీప్‌ ఇది నువ్వేనా!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నవదీప్‌కి అమ్మాయిల్లో ఉన్న పిచ్చ క్రేజ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగా పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, అవకాశాలు తగ్గేసరికి, సపోర్టింగ్‌ రోల్స్‌తోనూ, విలన్‌గానూ కూడా ఆకట్టుకుని మెప్పించాడు నవదీప్‌. తనకు అమ్మాయిల్లో అంత క్రేజ్‌ ఉండడానికి కారణం ఆయన ఫిట్‌నెస్సే అని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే, లేటెస్ట్‌గా నవదీప్‌ లుక్స్‌ అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాయి. కండలు తిరిగిన దేహంతో నవదీప్‌ బాలీవుడ్‌ హీరోల్ని తలపిస్తున్నాడు. ఇంతకీ ఈ లుక్స్‌లోకి నవదీప్‌ ఎందుకు మారినట్లు..? అది సస్పెన్సే. బన్నీ - త్రివిక్రమ్‌ సినిమాలో నవదీప్‌ నటిస్తున్నాడు.

 

ఒకవేళ ఆ సినిమా కోసమేనా ఈ భారీ మేకోవర్‌ అని అంతా భావిస్తున్నారు. అయితే, దీంతో పాటు, రెండు తమిళ చిత్రాల్లోనూ నవదీప్‌ నటిస్తున్నాడు. ఒకవేళ ఆ సినిమాల కోసమా.? ఏమో, ఏ సినిమా కోసం నవదీప్‌ ఇంతలా కండలు పెంచేశాడో కానీ, ఈ కండల్లో నవదీప్‌ని చూస్తుంటే, మనోడికి అమ్మాయిల్లో ఉన్న క్రేజ్‌ మరింత పెరిగిపోయేలా ఉంది. హీరోలు రామ్‌చరణ్‌, బన్నీ, రానాలను తలదన్నేలా బాడీ బిల్డింగ్‌ చేసిన నవదీప్‌ తన ఈ తాజా లుక్స్‌కి ఆ హీరోలే ఇన్సిప్రేషన్‌ అంటున్నాడు. తన ట్రైనర్‌ కృష్ణ సద్వలే పేరును ఈ సందర్భంగా నవదీప్‌ పరిచయం చేశాడు. ఏది ఏమైనా ఈ కొత్త లుక్స్‌లో నవదీప్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అయిపోతున్నాయ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS