వ‌ద్ద‌నుకున్న పూరినే... దిక్క‌య్యాడా?

By iQlikMovies - August 07, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

డియ‌ర్ కామ్రేడ్‌కి ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఎవ్వ‌రూ ప‌ట్ట‌లేక‌పోయారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందంలాంటి సూప‌ర్ హిట్లిచ్చిన త‌ర‌వాత‌... త‌న స్టార్ డ‌మ్ ఒక్క‌సారిగా మారిపోయింది. పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు విజ‌య్‌తో ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అందులో పూరి జ‌గ‌న్నాథ్ కూడా ఒక‌డు. పూరి - విజ‌య్‌ల సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని వార్త‌లొచ్చాయి. వీటిపై విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా స్పందించాడు. పూరితో సినిమా చేసే ఉద్దేశ్యాలేం లేవ‌ని, అస‌లు ఆ దిశ‌గా ఆలోచించ‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు.

 

నిజానికి విజ‌య్ తో సినిమా చేయాల‌ని పూరి అనుకున్న‌మాట వాస్త‌వం. కానీ... చేతిలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ప‌డే స‌రికి... పూరిని ప‌ట్టించుకోలేదు విజ‌య్‌. దాంతో.. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారింది. డియ‌ర్ కామ్రేడ్ ఫ్లాప్‌తో విజ‌య్ ఓ ప‌ది అడుగులు వెన‌క్కి వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్‌తో పూరి తేరుకున్నాడు. అందుకే ఇప్పుడు పూరి వైపు చూస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

 

పూరితో ఓసినిమా ప‌క్కా చేయించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. ఈ మేర‌కు పూరి ద‌గ్గ‌ర‌కు రాయ‌బారం కూడా పంపించాడ‌ని టాక్‌. పూరి కూడా కాస్త మెత్త‌బ‌డి.. విజ‌య్‌తో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడ‌ట‌. మ‌హేష్ కోసం రాసుకున్న `జ‌న‌గ‌ణ‌మ‌ణ‌` వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న‌ద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS