యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ వివాహానికి ఏప్రిల్ 16 ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా, ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్స్ వంటివి ఇరకాటంలో పడ్డాయి. మన ప్రియమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు తక్కువ మంది కుటుంబ సభ్యులతో అంటే 200 మందికి మించకుండా వివాహ కార్యక్రమాలు తేల్చేయాలని సూచించారు. ఫంక్షన్ హాల్స్‌ని అవైడ్ చేయాలని నియమం పెట్టారు. ఈ క్రమంలో నిఖిల్ పెళ్లి వాయిదా పడిరదనే వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తల పట్ల చాలా స్పీడుగా స్పందించిన నిఖిల్, తన పెళ్లి వాయిదా వార్తల్లో నిజం లేదనీ, అనుకున్న ముహూర్తానికే తన పెళ్లి జరుగుతుందని చెప్పారు.
పరిస్థితులు అనుకూలిస్తే, ధూమ్ ధామ్‌గా జరుగుతుందని, లేదంటే, గుడిలోనైనా తాళి కడతాననీ చెప్పుకొచ్చాడు నిఖిల్. టోటల్‌గా కరోనా తన పెళ్లికి ఆటంకం కాదనీ నిఖిల్ ప్రూవ్ చేయబోతున్నాడన్న మాట. భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మను గత కొంత కాలంగా లవ్ చేస్తున్న నిఖిల్, పెద్దల అంగీకారంతో ఇటీవలే నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఏప్రిల్ 16న వీరి వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ లోగా కరోనా ఎఫెక్ట్ వచ్చి పడిరది. ఏది ఏమైతేనేం, నిఖిల్ పెళ్లి వాయిదా.. అంటూ సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్‌ని డైరెక్ట్‌గా కొట్టి పాడేశాడీ ఎనర్జిటిక్ హీరో నిఖిల్.