కరోనా ఎఫెక్ట్ దారుణంగా పడింది. షూటింగులు, సినిమా రిలీజులూ వాయిదా పడ్డాయి. మళ్లీ చిత్రసీమ యధాస్థితికి రావడానికి కాస్త టైమ్ పడుతుంది. ఈ ఉగాదికి రావల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. ఏప్రిల్ లో విడుదల కానున్న కొన్ని చిత్రాలు కూడా మెల్లగా వెనక్కి వెళ్లాయి. మే 15న వకీల్ సాబ్ రావాలి. అప్పటికి ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. వకీల్ సాబ్ షూటింగుకి కరోనా ఎఫెక్ట్ పడింది. ఉగాది తరవాత మొదలవ్వాల్సిన షూటింగ్.. నివధికంగా వాయిదా పడినట్టైంది. ముందు నుంచీ ఈ సినిమా షూటింగు స్లోగానే సాగుతోంది. కరోనా ప్రభావం లేనప్పుడు కూడా వకీల్ సాబ్ మే 15న రావడం కష్టమని విశ్లేషకులు తేల్చేశారు.
ఇప్పుడు ఎలాగూ కరోనా వచ్చేసింది. దాంతో ఈ సినిమా మేలో రాదన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. దిల్ రాజు బృందం కూడా ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేసే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలూ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. దానికి తోడు కరోనా.. సో... వకీల్ సాబ్ అనుకున్న సమయంలో రావడం కష్టమే అన్నమాట. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారన్నది మళ్లీ షూటింగులు మొదలయ్యే నాటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.