బ్యాచిల‌ర్ 'భీష్మ‌'.. క్లారిటీ వ‌చ్చేసింది

By Inkmantra - March 30, 2019 - 09:03 AM IST

మరిన్ని వార్తలు

'ఛ‌లో'తో తొలి అడుగులోనే ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకీ కుడుముల‌. ఆ సినిమా అయిన వెంట‌నే... నితిన్‌తో క‌ల‌సి ప‌నిచేసే ఛాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రానికి 'భీష్మ‌' (సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్‌) అనే టైటిల్ ఖ‌రారు చేయ‌డం, ర‌ష్మిక‌ని క‌థానాయిక‌గా ఎంచుకోవ‌డం జ‌రిగిపోయాయి. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ట్టాలెక్క‌లేదు. అస‌లు ఈ సినిమా ఉంటుందా, లేదా?  అనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. సెకండాఫ్ విష‌యంలో నితిన్ సంతృప్తిగా లేడ‌ని, అందుకే ఈ ప్రాజెక్టుని ప‌క్క‌న పెట్టేశార‌ని వార్త‌లొచ్చాయి.

 

అయితే ఎట్ట‌కేల‌కు 'భీష్మ‌' విష‌యంలో క్లారిటీ దొరికేసింది. ఈ సినిమా ఆగిపోలేదు. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈరోజు (శ‌నివారం) నితిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా నిన్న భీష్మ టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. అంటే... ఈ సినిమా ఉంద‌నే క‌దా అర్థం. అయితే షూటింగ్ ఎప్పుడో మాత్రం చెప్ప‌లేదు. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటితో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్‌లో ఈ చిత్రం మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాతే భీష్ము ఉండొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS