లెక్కలు సరే బన్నీ.. ఆ లెక్కలు తేల్చేదెప్పుడు మరీ.?

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుండి సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది. కొత్త సినిమా ఇంకా సెట్స్‌ పైకి వెళ్లలేదు. ఎట్టకేలకు త్రివిక్రమ్‌తో సినిమా ఓకే చేశాడంటే, ఆ సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఫ్యాన్స్‌ ఎంతగా గగ్గోలు పెడుతున్నా, బన్నీ ఎందుకో పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే, ఫలానా డైరెక్టర్‌తో బన్నీ సినిమా అట అంటూ ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. అనౌన్స్‌ చేసిన సినిమా పరిస్థితే ఇలా ఉంటే, 'అట' అనే ప్రాజెక్టుల సంగతి ఏంటి బన్నీ.? అంటూ ఫ్యాన్స్‌ కూసింత నిరుత్సాహపడుతున్నారు. 

 

ప్రచారంలో ఉన్న సినిమాల లిస్టు చూస్తే చాలా పెద్దదే. ఏకంగా మూడు, నాలుగు ప్రాజెక్టులు వరకూ ఉన్నాయి మరి. ఆ లిస్టులో సుకుమార్‌ కూడా ఉన్నాడు. అలాగే 'ఓ మై ఫ్రెండ్‌', నానితో 'ఎంసీఏ' సినిమాలు చేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ పేరు కొత్తగా లిస్టులో చేరింది. బన్నీ కోసం గత కొంత కాలంగా ఈయన ఓ స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. దాదాపు ఆ స్క్రిప్టు ఓ కొలిక్కి వచ్చేసిందనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

 

ఒకవేళ తికమక, మకతిక అయ్యి త్రివిక్రమ్‌ సినిమా ఔట్‌ అయ్యి, వేణు శ్రీరామ్‌ సినిమా ఇన్‌ అవుతుందేమో చూడాలిక. ఈ సినిమాకి నిర్మాత కూడా రెడీగానే ఉన్నారట. ఆయన మరెవరో కాదు, దిల్‌రాజు. ఇంత సమాచారం ఉన్న ఈ సినిమానైనా బన్నీ పట్టాలెక్కిస్తే బావుండు. ఇదిలా ఉంటే, మరోవైపు విక్రమ్‌ కుమార్‌ కూడా బన్నీ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ విక్రమ్‌ కుమార్‌ ప్రస్తుతం నానితో 'గ్యాంగ్‌లీడర్‌' సినిమా చేస్తున్నాడు. ఏది ఏమైనా ఫ్యాన్స్‌ ఆరాటం తీరాలంటే బన్నీ సినిమా ఏదో ఒకటి అతి త్వరలో సెట్స్‌ పైకి వెళ్లి తీరాల్సిందే. ఏం చేస్తాడో బన్నీ చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS