అల్లరోడికి 'మహర్షి' కలిసొచ్చేలానే ఉందిగా.!

మరిన్ని వార్తలు

కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌లో చాలా మంచి నటుడున్నాడు. కామెడీతో పాటు, అన్ని రకాల ఎమోషన్స్‌ పండించగలడు ఆ నటుడు. ఆల్రెడీ ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో అల్లరి నరేష్‌ చాలానే సినిమాలు చేశాడు. యంగ్‌ హీరో శర్వానంద్‌తో 'గమ్యం'లో అల్లరి నరేష్‌ పోషించిన 'గాలి శీను' పాత్ర మర్చిపోలేనిది. ఆ తర్వాత 'శంభో శివ శంభో' సినిమాలోనూ చెవిటిఫ్రెండ్‌గా అల్లరి నరేష్‌ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

 

అవన్నీ ఒకెత్తు. లేటెస్ట్‌గా అల్లరి నరేష్‌ నటిస్తున్న 'మహర్షి' స్టార్‌డమ్‌ పరంగా ఇంకో ఎత్తు. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకి ఫ్రెండ్‌ పాత్రలో నరేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్‌ అంటే ఏదో ఆ పాత్ర మధ్యలో వచ్చి పోతుందేమో.. అక్కడున్నది మహేష్‌ కదా.. నరేష్‌ పాత్రకు ఓ మోస్తరు ఇంపార్టెన్స్‌ మాత్రమే ఉంటుందేమో. అసలే ఇప్పుడు అల్లరి నరేష్‌ మార్కెట్‌కి అంతగా డిమాండ్‌ లేదు కదా.. అని భావించారంతా. కానీ లేటెస్ట్‌గా విడుదలైన 'మహర్షి' పోస్టర్లు ఆ అనుమానాల్ని పటాపంచలు చేసేశాయి. 

 

మహేష్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో ఏరి కోరి నరేష్‌ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారో పోస్టర్స్‌ని బట్టి అర్ధమవుతోంది. ఇది ఏమంత ఆషా మాషీ క్యారెక్టర్‌ కాదని డిసైడ్‌ అయిపోయారు జనం. సినిమా కథపై ఓ అంచనాకొచ్చేశారు. ఖచ్చితంగా ఈ సినిమాతో అల్లరి నరేష్‌ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పోస్టర్స్‌ రిలీజయ్యాక, ఇక సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా.? అనే ఆశక్తి అంతటా నెలకొంది. ఈ ఏడాది ఓపెనింగ్‌ నుండి ఒక్క 'ఎఫ్‌ 2' మినహాయిస్తే, బాక్సాఫీస్‌కి సవాల్‌ విసిరే, అసలు సిసలు సినిమా రాలేదింతవరకూ. అది 'మహర్షి' అవుతుందని ఆశిద్దాం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS